డీఎస్పీ గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగింది: బీఆర్ నాయుడు 18 h ago
AP: తిరపతి తొక్కిసలాటలో భక్తుల మృతి దురదృష్టకరం అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డీఎస్పీ గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగిందని చెప్పారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. గాయపడ్డ వారిని చంద్రబాబు పరామర్శించి, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందచేస్తారని బీఆర్ నాయుడు పేర్కొన్నారు.